అఫ్ఘానిస్తాన్‌లో మహిళలకు విద్య నిషేధం!

October 18, 2026
img

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం మరో దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలో బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా శాశ్వతంగా నిషేదిస్తున్నట్లు అఫ్ఘానిస్తాన్ విద్యాశాఖ మంత్రి షేక్ నెదా మహమ్మద్ నదీమ్ అధికారికంగా ప్రకటించారు. ఈ

మహిళల విద్యకు సంబంధించిన అంశాలపై చర్చలు ఇకపై పూర్తిగా నిలిపివేయబడ్డాయని, ఈ ఉత్తర్వులు ఇస్లామిక్ షరియా చట్టాలు, అఫ్ఘాన్ సంప్రదాయాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. తమ నిర్ణయాలను తప్పుబట్టేందుకు ఎవరికీ మతపరమైన హక్కు లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

అఫ్ఘానిస్తాన్‌లో 2021లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి మహిళలు, బాలికలపై అనేక ఆంక్షలు విదిస్తూనే ఉంది. 

పన్నెండు ఏళ్ల లోపు బాలికలకు 6వ తరగతి వరకు మాత్రమే చదువుకునేందుకు అనుమతిస్తోంది. ఇప్పుడు పూర్తిగా నిషేధం విధించింది. 2022 డిసెంబర్‌లో విశ్వవిద్యాలయాలలో మహిళలకు ప్రవేశాలపై నిషేధం విధించింది.   

ఇటువంటి నిర్ణయాలు, వేధింపుల వలన ఇప్పటికే అఫ్ఘానిస్తాన్‌లో 22 లక్షలకు పైగా బాలికలు చదువులకు దూరమయ్యారని ఐఖ్యరాజ్య సమితి బాలల సంక్షేమ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. తాజా నిషేధంతో అఫ్ఘానిస్తాన్‌లో మహిళలు అందరూ నిరక్షరాస్యులుగా మారబోతున్నారు. 

మహిళలు విద్యకు దూరం అవడం వలన వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా ఉండవు. కనుక ఆఫ్గనిస్తాన్‌పై దీర్గ కాలంలో ఈ ప్రభావం చాలా భయంకరంగా ఉండబోతోంది. అయితే ప్రపంచ దేశాలు, యూనిసెఫ్ హితోక్తులు తాలిబన్లు వినే పరిస్థితిలో లేరు. కనుక ఆఫ్గనిస్తాన్‌ మహిళలు మౌనంగా ఈ పీడన భరించక తప్పడం లేదు. 

Related Post