రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్‌సి17 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి రెండు ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి.
1. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాత్విక వీరవల్లిని ఎంపిక చేయడం. 2. ఈ సినిమాలో నటించేందుకు 16 నుంచి 60 ఏళ్ళ వయసున్న నటీనటుల కోసం ఎక్స్‌లో కాస్టింగ్ కాల్.
ఈ సినిమా కోసం సాత్విక వీరవల్లికి ఆడిషన్ నిర్వహించగా ఓకే అయినట్లు సమాచారం. కనుక త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. కనుక ఈ సినిమాలో నటించేందుకు కొత్తవారిని తీసుకోవాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
సినిమాలో నటించాలని కలలుగనేవారు వేలమంది ఉంటారు. వారిలో చాలా మందికి జీవితకాలంలో అవకాశం రాకపోవచ్చు. కానీ అలాంటివారికి రామ్ చరణ్ సినిమాలోనే అవకాశం లభించడం చాలా అదృష్టమే.
ఆసక్తి ఉన్నవారు src17casting@gmail.com లేదా వాట్సప్ నంబర్: 91110 564651కు తమ వివరాలు పంపించవచ్చునని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. తమ వివరాలను కేవలం టెక్స్ట్ మెసేజ్ ద్వారానే పంపాలని, ఫోన్ చేయవద్దని, అలాగే ఇన్‌స్టా రీల్స్ పంపవద్దని కాస్టింగ్ కాల్ ప్రకటనలో పేర్కొంది.
అర్హులైనవారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్ నిర్వహిస్తామని ప్రకటించింది.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ సిరీస్ కలిసి నిర్మించబోతున్నాయి.
A new world. A new story. And maybe, a role that’s waiting for YOU ❤️🔥 The casting doors are now open for #RC17 🎯 We’re looking for actors across age groups to be a part of this exciting cinematic journey. Send in your auditions to src17casting@gmail.com 📲 WhatsApp: 9110564651 #YouCanImagine #RC2Sukku #SRC Mega Power Star @AlwaysRamCharan Master Storyteller @aryasukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl
— Mythri Movie Makers (@MythriOfficial) November 27, 2026