సంక్రాంతి రద్దీకి 30 ప్రత్యేక రైళ్లు

November 28, 2026
img

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనుంది. 

ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్-పార్వతీపురం మధ్య డిసెంబర్ 23 నుంచి జనవరి 28 వరకు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి బుధవారం సికింద్రాబాద్ నుంచి, గురువారం పార్వతీపురం నుంచి బయలుదేరుతాయి.

చర్లపల్లి-నర్సాపూర్ మధ్య జనవరి 10, 11, 12, 13, 17, 18, 19, 20 తేదీల్లో 

హైదరాబాద్-నర్సాపూర్ మధ్య జనవరి 9, 10, 16, 17 తేదీల్లో

చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ మధ్య జనవరి 7, 8, 9, 10, 16, 17 తేదీల్లో రైళ్లు నడుస్తాయి.

ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయి. వీటికి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్స్ అందుబాటులో ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Related Post