హైదరాబాద్ మెట్రో@ 10 ఏళ్ళు

November 28, 2026
img

హైదరాబాద్ మెట్రో తొమ్మిదేళ్ళుగా ప్రజలకు సేవలందిస్తూ విజయవంతంగా పదో ఏడాదిలో అడుగుపెట్టింది. తెలంగాణ ఏర్పడక మునుపు మెట్రో ఆలోచనలు ఉన్నా అవి 2017లో కార్యరూపం దాల్చాయి. 2017, నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నగరంలో మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి.

మధ్యలో కరోనా, లాక్ డవున్ వంటి అనేక అవరోధాలను అధిగమిస్తూ ముందుకు దూసుకుపోతూనే ఉంది. ఇప్పటివరకు మొత్తం 94.2 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకున్నారు. తర్వాత వంద కోట్ల మైలురాయి కూడా అధిగమించబోతోంది. 

ప్రస్తుతం నగరం నలువైపులా 69.2 కిలోమీటర్ల మేర విస్తరించిన మూడు కారిడార్లలో 57 స్టేషన్ల ద్వారా రోజూ సుమారు 1,100 రైలు సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో సగటున 4.5 నుంచి 4.8 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పండుగలు, వారాంతాల్లో ఈ సంఖ్య 5 లక్షలు దాటుతోంది. ఇప్పటి వరకు గరిష్ఠంగా ఒక్కరోజు 5.20 లక్షల మంది ప్రయాణించారు. 

హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో, జనాభా కూడా పెరుగుతోంది. కనుక మెట్రోలో ప్రయాణికులకు రద్దీ కూడా నానాటికీ పెరుగుతూనే ఉంది. కనుక ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనంగా కోచ్‌లు జోడించేందుకు టెండర్లు ఆహ్వానించారు. 

మెట్రో రెండో దశలో ఏడు కొత్త కారిడార్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. 

Related Post