హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ట్రక్ పార్కింగ్ కోసం కేటాయించిన 3.15 ఎకరాలు వేలంపాటకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వేలంపాటని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు అధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇటీవల ధర్నా చేపట్టాయి.
ఈ ప్రతిపాదన తక్షణం ఉపసంహరించుకోవాలని లేకుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వేలంపాటలో కొనుగోలు చేసిన భూములకు అనుమతులు రద్దు చేసి స్వాధీనం చేసుకుంటామని హరీష్ రావు హెచ్చరించారు. న్యాయపోరాటం కూడా చేస్తామని అప్పుడే హెచ్చరించారు.
చెప్పినట్లుగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త కాంతారావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేసి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు పిటిషన్లు కొట్టివేసింది. దీంతో నేడు ఆన్‌లైన్‌లో వేలంపాటకు అవరోధాలు తొలగిపోయాయి.
హైకోర్టు తీర్పుపై ఈ వేలంపాటని తీవ్రంగా వ్యతిరేకించిన హరీష్ రావు ఏవిధంగా స్పందిస్తారో? చూడాలి.