క్రిస్మస్‌ సందర్భంగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం

November 26, 2026


img

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ రిజిస్టర్డ్ చర్చికి రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

చర్చిల ప్రాంగణాలను పండుగకు సిద్ధం చేసేందుకు ఈ మొత్తాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చర్చిలకు వైట్‌వాషింగ్ చేయడం, విద్యుత్ దీపాలతో అలంకరించడం వంటి పనుల కోసం ఈ నిధులు ఉపయోగించాలి. బతుకమ్మ, దసరా, శ్రీరామనవమి వంటి హిందూ పండగలకు ఏవిధంగా దేవాలయాల అలంకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందో అదేవిధంగా ఇప్పుడు క్రిస్మస్ పండగ సందర్భంగా రాష్ట్రంలో చర్చిలకు కూడా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. 

దీని కోసం నవంబర్ 23న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హత కలిగిన చర్చిల నిర్వాహకులు నవంబర్ 30వ తేదీలోగా www.tgommms.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

రాష్ట్రవ్యాప్తంగా చర్చిలకు సాయం అందించేందుకు ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా కోటా విధానాన్ని అమలు చేయనుంది. సంబంధిత జిల్లా అధికారులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అర్హత కలిగిన చర్చిల సంఖ్యను కేటాయిస్తారు. దరఖాస్తులు పరిశీలించి ఎంపిక చేసిన చర్చిలకు ఈ ఆర్థిక సాయం వెంటనే అందిస్తుంది. 


Related Post