ఇడుపు కాయితం నుంచి ఉల్లిపూల లిరికల్

November 26, 2026


img

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా చేసిన ‘ఇడుపు కాయితం’ నుంచి విడుదలైన మూడు పాటలు చాలా బాగున్నాయి. ఇప్పుడు ‘ఉల్లిపూల’ అంటూ సాగే నాలుగో లిరికల్ వీడియో సాంగ్‌ శనివారం విడుదల కాబోతోంది. ఈవిషయం తెలియజేస్తూ హీరోహీరోయిన్ల పోస్టర్‌ వేశారు. 

ఈ సినిమాలో మైమ్ మధు, అభయ్ బేతిగంటి, రచ్చ రవి, జోర్దార్ సుజాత, బిత్తిరి సత్తి, చంద్రవ్వ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి) తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.

ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫి: ఎం.ఎస్.బాల్ రెడ్డి, ఆర్ట్: ఆశిష్ తేజ పుల్లెల,ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి చేశారు. 

సుకుమార్ రైటింగ్స్, బీవీ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వంశీ రెడ్డి దొండపాటి, సురేష్ బొబ్బిలి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 11న థియేటర్లలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష