మన సమాజంలో, మన చుట్టూ నివసిస్తున్నవారిలో కొందరి జీవితాలు చాలా ఊహాతీతంగా సాగుతుంటాయి. అటువంటి కథతో తెరకెక్కించిన సినిమాయే ‘పాకెట్ రాకెట్స్.’
ఈ సినిమా నుంచి అప్సర అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. రమేష్ కుమార్ వకచర్ల వ్రాసిన ఈ పాటకు ఈ సినిమా నిర్మాత, సంగీత దర్శకుడు గ్యానీ సంగీతం సమకూర్చి స్వయంగా ఆలపించారు.
రుద్ర అత్రి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో శ్రియా కొంతం హీరోయిన్‌గా నటించారు. జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరీటి దామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు సంగీతం: గ్యానీ, సినిమాటోగ్రఫీ: ఎదురోలు రాజు, ఎడిటింగ్: అన్వర్ అలీ చేస్తున్నారు.
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.