రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి మృతి చెందారు. ఈ ఘటనపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మణికుమార్ రెడ్డి తన ఇద్దరు స్నేహితులు భరత్, రాజేష్‌లతో కలిసి బైక్‌పై వెళ్తున్నప్పుడు వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మణికుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భరత్, రాజేష్‌లను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ రాత్రి 2 గంటల సమయంలో భరత్ కూడా మృతి చెందారు. మరో యువకుడు రాజేష్ పరిస్థితిపై ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మణికుమార్ రెడ్డి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.