టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈసారి నేరుగా తన అన్న, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని ఉద్దేశ్యించి సంచలన విషయాలు బయటపెట్టారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఏమన్నారంటే, “2019లో నాకు క్యాన్సర్ వ్యాధి సోకిందని, త్వరలోనే చనిపోతానంటూ కేటీఆర్ ఆధ్వర్యంలో నడిచిన సోషల్ మీడియా టీమ్ తప్పుడు ప్రచారం చేసింది.
నాపై చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు, నిరాధార ప్రచారాలు చేయించారు. ఒక అన్న ఏ చెల్లి పట్ల వ్యవహరించనంత దారుణంగా, నిర్దాక్షిణ్యంగా కేటీఆర్ నాపట్ల వ్యవహరించారు. ఇంతకాలం ఇలాంటి విషయాలు బయటపెట్టడం సబబు కాదని ఊరుకున్నాను. కానీ నా సహనం నశిస్తోంది కనుక ఇప్పుడు బయట పెడుతున్నాను.
నిజామాబాద్‌లోని బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని కేసీఆర్‌ను నేను స్వయంగా పలుమార్లు కోరినా పట్టించుకోలేదు. దాంతో నేను స్థానిక రైతులను తీసుకువెళ్ళి మళ్ళీ అభ్యర్ధించాను. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. దానిని కేటీఆర్ తన స్నేహితుడికి ఇస్తానని మాట ఇచ్చినందున అంగీకరించలేదని తర్వాత తెలుసుకున్నాను.
నా నిజామాబాద్ నియోజకవర్గంలో ఒకరికి లక్షల రూపాయల ఖర్చు అయ్యే వైద్య చికిత్సల కోసం నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేను సిఫార్సు లేఖ పంపిస్తే, కేవలం రూ.60వేలు మంజూరు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఇలాంటి అవమానాలు గురించి చెప్పుకుంటే చిల్లరగా ఉంటుందని ఇంతకాలం మౌనం వహించాను.
నా తండ్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అయన కూతురినైన నా ఫోన్ ట్యాపింగ్ చేయించడమే దారుణం అనుకుంటే, రాజకీయాలతో సంబంధం లేని నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేయించారు. ఇందుకు మేము చాలా బాధ పడ్డాము.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేను ఉపయోగించిన 11 సెల్‌ఫోన్లను స్వయంగా అప్పగించాను. కానీ కేటీఆర్‌ను ల్యాప్‌టాప్ స్వాధీనం చేయాలని దర్యాప్తు సంస్థలు అడిగితే ఆయన కోర్టుకు వెళ్ళారు. కేటీఆర్ తన ల్యాప్‌టాప్‌ను దర్యాప్తు సంస్థలకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పగలరా?” అని కవిత ప్రశ్నించారు.
ఒరేయ్ టిల్లు… నీలో మంచి స్టోరీ రైటర్ ఉన్నాడ్రా!
ఇలాంటి స్క్రిప్టులు సినిమాల్లో కూడా ఊహించలేం! రాజకీయాల్లో అసలు కథలు బయటకు వస్తుంటే ఎంటర్టైన్మెంట్కు కొదవే లేదు!
#TelanganaPolitics #Kavitha #KTR #BRS #PoliticalDrama
@RaoKavitha @KTRBRS @BRSparty https://t.co/gxPLpDnmK9