కామ్రేడ్ కళ్యాణ్ అంటూ ప్రేక్షకులను నవ్వించిన శ్రీ విష్ణు, సంక్రాంతి పండుగకు ‘ఫ్యామిలీ ప్యాక్’తో వచ్చి మరోసారి ప్రేక్షకులను నవ్వించబోతున్నారు. ఈ సినిమా టీజర్ సోమవారం, సంక్రాంతి పండుగకు ‘ఫ్యామిలీ ప్యాక్’ విడుదల చేయబోతున్నట్లు శ్రీ విష్ణు సోషల్ మీడియాలో ప్రకటించిన తీరు కూడా హాయిగా నవ్వుకునేలా ఉంది.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్న ఈ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టర్‌టైనర్‌లో శ్రీ విష్ణుకు జోడీగా సాక్షి మదోల్కర్ నటిస్తున్నారు. అభిరామి, నరేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, నెల్లూరు సుదర్శన్, ఆదిత్య చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ ఫ్యామిలీ ప్యాక్‌కు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: భాను భోగవరపు, నందు సావిరిగాన, సంగీతం: చైతన్ భరద్వాజ్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ కలిసి ఈ ‘ఫ్యామిలీ ప్యాక్’ను సంక్రాంతికి ప్రేక్షకులకు అందించబోతున్నారు.