తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి మాజీ మంత్రి, సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకుంది.
మెడికల్ కాలేజీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కాలేజీ, ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్‌కు కూడా అనంతుల మదన్ మోహన్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఈ వైద్య కళాశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పేరు పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి!
The Government of Telangana has officially named the Government Medical College, #Siddipet, after late Sri #AnanthulaMadanMohan, former Minister and MLA of Siddipet, in recognition of his invaluable contributions to the State. The G.O. also extends his name to the associated Government General Hospital, College of Nursing, https://t.co/daebZnYOsl. Allied Health Sciences College and AYUSH Integrated Hospital. A fitting tribute to a distinguished leader and his enduring legacy. @revanth_anumula @DamodarCilarapu @IPRTelangana
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) November 21, 2026