తల్లి మందలిస్తే కూతురు ఆత్మహత్య!

November 21, 2026
img

ఈ ఘటన హైదరాబాద్‌లోని హయత్ నగర్‌, బొమ్మలగుడిలో జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లమ్మ రంగాపురంకు చెందిన బొడ్డుపల్లి కిశ్నయ్య, అలివేలు దంపతులు ఊళ్ళో పనులు దొరక్క హైదరాబాద్‌ వచ్చి హయత్ నగర్‌, బొమ్మలగుడిలో నివాసం ఉంటున్నారు. 

తమ రెండో కుమార్తె లక్ష్మీదేవి (25)ని నల్గొండ జిల్లాకు చెందిన పగిళ్ళ లక్ష్మణ్‌కి ఇచ్చి పెళ్ళి చేశారు. అతను కూడా హైదరాబాద్‌ వచ్చేసి భార్య, అత్తమామలతో కలిసి ఉంటున్నాడు. లక్ష్మీదేవి-లక్ష్మణ్‌ దంపతులకు ఏడేళ్ళు వయసున్న ఒక కూతురు, మూడేళ్ళు వయసున్న ఒక కొడుకు ఉన్నారు. అతను పెయింటర్‌గా పని చేస్తుంటే, లక్ష్మీదేవి తల్లి అలివేలు కూడా  ఇరుగుపొరుగు ఇళ్ళలో పనిచేస్తున్నారు.

ఇటీవలే ఆమెకు భర్త మొబైల్ ఫోన్ కొని ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె దానిలో రీల్స్ చూడటం మొదలు పెట్టి చివరికి అవి చూడనిదే ఉండలేని పరిస్థితికి వచ్చింది. మొన్న (గురువారం) ఆమె ఎప్పటిలాగే ఫోన్లో రీల్స్ చూస్తుంటే, తల్లి అలివేలు ఆమెను మందలించింది. ‘పిల్లలను పట్టించుకోకుండా, ఏ పని చేయకుండా ఎప్పుడూ ఆ ఫోన్ చూస్తూ కూర్చుంటే ఎలా?” అంటూ కూతురిని మందలించింది.    

ఆ చిన్న మాటకే ఆమె మనస్తాపం చెంది, పిల్లలని టీవీ చూస్తూ ఉండమని చెప్పి, పక్క గదిలోకి వెళ్ళి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది! 

Related Post