సమంత-రాజ్ దంపతుల నుంచి ఓ శుభవార్త!

November 20, 2026
img

ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, సమంత దంపతులు ఓ శుభవార్త తెలిపారు. నవంబర్‌ 19వ తేదీన తమకు మగ శిశువు జన్మించాడని వారు ‘ఎక్స్‌’ ద్వారా తెలియజేస్తూ తల్లి చేతి వేలు పట్టుకున్న ఆ చిన్నారి చేతి వేళ్ళను మాత్రం చూపారు. బాబుకి 'దేవ్ నిడిమోరు' అని పేరు పెట్టినట్లు తెలియజేశారు. వారికి అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. 

నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత జీవితం చాలా దుర్భరంగా మారింది. ఓ పక్క మానసిక వేదన, ఆరోగ్య సమస్యలు, మరోపక్క వరుస ఫ్లాపులతో ఆమె జీవితంలో అత్యంత కష్టకాలం అది. ఆ తర్వాత ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌ సిరీస్‌లో రాజ్ నిడిమోరుతో పరిచయం ప్రేమ, పెళ్ళి తర్వాత మళ్ళీ ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు సినీ జీవితం కూడా సాఫీగా సాగుతోంది. ఇప్పుడు పండంటి మగబిడ్డకు తల్లి కూడా అయ్యింది. కనుక ఆమె జీవితం మళ్ళీ గాడిన పడినట్లే! ఇలాగే సాఫీగా సాగిపోవాలని కోరుకుందాం.       


Related Post