హరీష్‌ రావు బీఆర్ఎస్‌లో ఉండరు: సీఎం రేవంత్‌

November 20, 2026


img

గురువారం సిద్ధిపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌తో సహా కేటీఆర్‌,   హరీష్‌ రావు, సంతోష్ రావు తదితరులపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఈ సందర్భంగా అయన హరీష్‌ రావు గురించి చెప్పిన జోస్యం ఆసక్తికరంగా ఉంది. 

“వచ్చే ఎన్నికల నాటికి హరీష్‌ రావు బీఆర్ఎస్‌ పార్టీలో ఉండరు. బిజేపిలో ఉంటారు. అయన బిజేపి అధిష్టానంతో టచ్‌లో ఉన్నారు. అయన సిద్ధిపేట ఎల్లమ్మ తల్లిపై ఒట్టేసి కాదని చెప్పగలరా?” అని అన్నారు. 

అయితే హరీష్‌ రావు.. సీఎం రేవంత్‌ రెడ్డితో టచ్‌లో ఉన్నారని, బీఆర్ఎస్‌ పార్టీలో ఆయనే రేవంత్ కోవర్టుగా పనిచేస్తున్నారని, ఏదో రోజు కేసీఆర్‌, కేటీఆర్‌లకు వెన్నుపోటు పొడిచి వారినీ, బీఆర్ఎస్‌ పార్టీని ముంచేస్తారు,” అని   టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పదేపదే ఆరోపిస్తుంటారు. 

కానీ హరీష్‌ రావు బిజేపిలో చేరబోతున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి జోస్యం చెప్పారు. అయితే తన ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉంటానని, కాని పక్షంలో రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని హరీష్‌ రావు పలుమార్లు చెప్పారు. 


Related Post