నటి కీర్తి సురేష్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె నటిస్తున్న ‘సత్యవాన్ సావిత్రి’ సినిమా ప్రెస్‌మీట్‌లో దర్శకుడు మిష్కిన్ ఆమెను తాకుతూ మాట్లాడిన వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మిష్కిన్ యామెను ప్రశంసిస్తూ మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న ఆమెను తాకారు. దీంతో కొందరు నెటిజన్లు కీర్తి సురేష్ చాలా అసౌకర్యానికి గురైనట్లు వ్రాసి పడేశారు. ఈ వీడియోను షేర్ చేసిన ఓ వ్యక్తి.. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాల్లో నటించే కీర్తి, బయట మాత్రం ఎందుకు ఇబ్బందిగా ఫీలవుతున్నారంటూ ప్రశ్నించారు.
దీనిపై కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “మొదట నా ముఖంలో అసౌకర్యం ఎక్కడ కనిపించింది? మాది తండ్రీకూతుళ్ల బంధం అని ఆయన, నేను చెప్పడం మీరు వినలేదా? ఒకవేళ నేను అసౌకర్యంగా ఫీలయ్యానని అనుకున్నా.. సినిమాల్లో నటించే సన్నివేశాలను చూపిస్తూ, బయట కూడా అలాంటి స్పర్శను అంగీకరించాలని చెబుతున్నారా? కొన్ని విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి” అంటూ బదులిచ్చారు.
కీర్తి స్పందన తర్వాత ఆ వ్యక్తి తన పోస్టును తొలగించి, ఆమెకు క్షమాపణలు చెప్పారు. తాను ఎలాంటి చెడు ఉద్దేశంతో పోస్ట్ చేయలేదని, వైరల్ అవుతున్నందుకే షేర్ చేశానని పేర్కొన్నారు.
కీర్తి సురేష్, మిష్కిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సత్యవాన్ సావిత్రి’ నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.