చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది.
2018లో ప్రకాశం జిల్లాకు చెందిన జెట్టి జానకీ రామయ్య అనే వ్యక్తి వద్ద నుంచి బండ్ల గణేష్ రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి జానకీ రామయ్య ఆరోగ్య సమస్యలతో మరణించారు.
కనుక అయన తండ్రి వెంకటేశ్వర్లు అభ్యర్ధన మేరకు ఈ బకాయి తిరిగి చెల్లించేందుకు బండ్ల గణేష్ ఒక చెక్ ఇచ్చారు. దానిని అయన బ్యాంకులో జమా చేయగా బండ్ల గణేష్ బ్యాంకు ఖాతాలో సరిపడా బ్యాలన్స్ లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయ్యింది.
ఆ తర్వాత అయన తీసుకున్న డబ్బు వడ్డీతో సహా చెల్లించాలని బండ్ల గణేష్‌ను ఎన్నిసార్లు అడిగినా స్పందించకపోవడంతో ఒంగోలు కోర్టులో కేసు వేశారు.
ఈ కేసును విచారించిన ఒంగోలు రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, అలాగే బాధితుడికి కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది.
అయితే ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు నెల రోజుల గడువు ఇచ్చింది. కనుక అయన హైకోర్టుని ఆశ్రయించడం ఖాయమేనని భావించవచ్చు.