బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘టైసన్ నాయుడు’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో అరాచక శక్తులను అణచివేసే టైసన్ నాయుడు అనే స్పెషల్ ఆపరేషన్ టీమ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు. టైసన్ నాయుడు టీజర్ వరకు వచ్చేసినా ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు.
సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమాలో నరేష్, రావు రమేష్, సత్య, వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రవీణ, శత్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: అనిత్ మధాడి, కొరియోగ్రాఫీ: విజయ్ పోలాకి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు చేస్తున్నారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.