ఐ హేట్ మ్యారేజ్… ట్రైలర్ విడుదల

November 17, 2026


img

సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా నటించిన ‘ఐ హేట్ మ్యారేజ్’ సినిమా ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. ప్రేమ, పెళ్లి, కెరీర్‌తో పాటు స్వతంత్రంగా జీవించాలనే నేటి తరం యువత ఆలోచనలు, భావోద్వేగాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్‌ స్పష్టం చేసింది. 

దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల మీడియాతో మాట్లాడుతూ, “ఎలాంటి సినిమాటిక్ అతిశయోక్తులు లేకుండా యువత నిజ జీవితంలో ఎదుర్కొనే భావోద్వేగాలు, నిర్ణయాలను సహజంగా చూపించే ప్రయత్నం చేశాం,” అని చెప్పారు. 

ఈ సినిమాలో హారిక రాజేందర్, సాహితి కృష్ణ కీలక పాత్రలు చేయగా, పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి, ప్రభావతి, ఆశ్రిత వేముగంటి, లోహిత్ కుమార్, బేబి తమోఘ్న, రాధ రాయసం, లక్ష్మి, జాకీర్, విజయ్ కుమార్, దాసరి పద్మ రేఖ, శ్రీదేవి ఆర్రోజు, మెయిల్ రమేష్, అరుణ్ కుమార్ రెడ్డి, ఇందు, అఖండ సుధాకర్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 

ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరమేష్ రేణుకుంట్ల, సంగీతం, పాటలు: వరిశుప్పల యాదగిరి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ప్రవీణ్ ఇమ్మడి, కెమెరా: విజయ్ సి. కుమార్, కొరియోగ్రఫీ: అల్లూ చాణక్య, రాజ్ కృష్ణ, ఆర్ట్: మోహన్ జల్లా, ఎడిటింగ్: ఆవుల వెంకటేష్,

ఆర్య సినిమా బ్యానర్‌పై దయానంద్ మాదం, కార్తీక్ వెంపటి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Related Post

సినిమా స‌మీక్ష