విడాకులు తీసుకోలేదు.. ఎవరి జీవితాలు వారివే: రమ్యకృష్ణ

November 15, 2026
img

ప్రముఖ నటి రమ్యకృష్ణ, దర్శకుడు కృష్ణవంశీ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ అప్పుడప్పుడు ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి.

వంశీ హైదరాబాద్‌లో, రమ్యకృష్ణ తన కుమారుడితో కలిసి చెన్నైలో నివసిస్తుండటమే ఈ ఊహాగానాలకు కారణం. కనుక వారిని మీడియా తరచూ ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటుంది. రమ్యకృష్ణ తాజా  ఇంటర్వ్యూలో తమ కాపురం గురించి స్పష్టత ఇచ్చారు. 

“మేము విడిపోలేదు. నేటికీ భార్యాభర్తలుగానే ఉన్నాము. 2003లో మా పెళ్ళి జరిగింది. ఏడాదిన్నర తర్వాత మాకు కుమారుడు జన్మించాడు. ఆ కారణంగా నేను కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండిపోయాను.

కానీ ఆ తర్వాత మళ్ళీ టీవీ సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టాను వాటి కోసం ప్రతీ రెండు వారాలకు ఒకసారి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళి వచ్చేదానిని. అలా వెళ్ళిన ప్రతీసారి బాబు అనారోగ్యానికు గురవుతుండేవాడు. కనుక వాడి ఆరోగ్యం చదువు కోసం నేను చెన్నై షిఫ్ట్ అయిపోయాను. 

నిజానికి కృష్ణవంశీ ముందే ఇలాంటి ప్రతిపాదన చేశారు. పెళ్ళి చేసుకొని రోజూ గొడవలు పడటం కంటే, ఇలా ఎవరి కెరీర్ కోసం వారు వేర్వేరుగా జీవిస్తూ కలిసి ఉండటమే మంచిదని ముందే చెప్పారు. కానీ అప్పుడు నేను వినలేదు. ఇప్పుడు అయన చెప్పినట్లే జరిగింది.

ఇద్దరం ఇలా వేర్వేరు నగరాలలో ఉంటూ జీవిస్తున్నాము తప్ప మేము విడిపోలేదు. మాకు మా కెరీర్, మా కుమారుడి చదువే ముఖ్యం. అందుకు ఈ మాత్రం త్యాగాలు చేయక తప్పదు,” అని రమ్యకృష్ణ తెలిపారు.

Related Post