యావత్ ప్రపంచ దేశాలన్నీ ఇంకా ఆలోచించక మునుపే చైనా ఆచరణలో పెడుతుంటుంది. ఇందుకు తాజా ఉదాహరణగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన పైలట్ రహిత, విద్యుత్ (చార్జింగ్) విమానం సీఈ-25ఏ.
దీనిని చైనా శనివారం విజయవంతంగా పరీక్షించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న తొలిసారిగా దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షించింది. దానిలో కనుగొన్న లోపాలు సరిచేసిన తర్వాత మళ్ళీ శనివారం ఇది కొంత సేపు గాల్లో ప్రయాణించి, భద్రంగా ల్యాండ్ అయ్యింది.
19 మంది ప్రయాణించడానికి వీలుగా రూపొందించిన ఈ విమానం గంటకు 300 కిలోమీటర్ల వేగంతో, 2,400 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
దీనికి మరిన్ని నిర్వహించిన తర్వాత అవసరమైన అనుమతులు లభిస్తే అప్పుడు ఇటువంటి విద్యుత్ విమానాల ఉత్పత్తి ప్రారంభిస్తుంది. బహుశః 2027 డిసెంబర్ నాటికి తొలి విమానసేవలు ప్రారంభించే అవకాశం ఉంది.