ఆ భూములు అమ్మే అధికారం మీకు లేదు: హరీష్‌

November 13, 2026


img

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ట్రక్ భూముల వేలంపాటని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు అధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను అమ్మేందుకు ప్రభుత్వానికి అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

ఈ ప్రతిపాదన తక్షణం ఉపసంహరించుకోవాలని హరీష్‌ రావు డిమాండ్ చేశారు. లేకుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వేలంపాటలో కొనుగోలు చేసిన భూములకు అనుమతులు రద్దు చేసి స్వాధీనం చేసుకుంటామని హరీష్‌ రావు హెచ్చరించారు. 

గత ప్రభుత్వం కూకట్‌పల్లిలో ట్రక్కుల పార్కింగ్ కోసం 3.15 ఎకరాల భూమి కేటాయించింది. దానినే ప్రభుత్వం ఈ నెల 27న వేలం వేయాలనుకుంటోంది. దీనిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా  బీఆర్ఎస్ పార్టీ కూడా ధర్నాలో పాల్గొంది. దీనిలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద తదితరులు పాల్గొని స్థానికులతో మాట్లాడారు.

ఈ భూమిని విక్రయించకుండా అడ్డుకుంటామని, స్థానికుల పక్షాన పోరాడతామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అలవాటు పడ్డారంటూ హరీష్‌ రావు తీవ్ర విమర్శలు చేశారు. 


Related Post