రియాలిటీ నుంచి రుత్తూ... స్వీట్ మెలోడీ సాంగ్

November 13, 2026


img

కిరణ్‌ అబ్బవరం, దేవికా భట్‌ జంటగా చేస్తున్న ‘రియాలిటీ’ నుంచి ‘రుత్తూ’ అంటూ సాగే మరో పాట విడుదలైంది. చిన్న చిన్న తేట తెలుగు పదాలతో చక్కటి సాహిత్యంతో పూర్ణాచారి వ్రాసిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం అందించారు. కపిల్ కపిలన్ అంతే మధురంగా ఆలపించారు.      

ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడుగా కిరణ్ అబ్బవరం, అతనికి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శరత్‌ కుమార్‌, సాయికుమార్‌, రమేష్‌ ఇందిర, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: కిరణ్‌ అబ్బవరం, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: విశ్వాస్‌ డేనియల్‌, ఆర్ట్‌: సుధీర్‌ మాచర్ల,  ఎడిటింగ్‌: సంతోష్‌ నాయుడు చేస్తున్నారు. 

జాయ్‌ ఫిల్మ్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సుధాకర్‌ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదల కానుంది. 


Related Post

సినిమా స‌మీక్ష