‘ఆల్కహాల్’తో డిసెంబర్ 18న వస్తున్న అల్లరి నరేశ్

November 12, 2026


img

అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆల్కహాల్’.  డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. 

మెహర్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుహానీ శర్మ, నిహారిక ఎన్‌ఎం హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్య, హర్షవర్ధన్, గిరీష్ కులకర్ణి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతం: గిబ్రాన్, నేపథ్య సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: జిజు సన్నీ, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 18న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష