పిచ్చి ప్రేమలో అలియాస్ రుక్మిణి.. రెండో పాట 13న విడుదల

November 11, 2026


img

నితిన్, ఆఫియా సయ్యద్ జంటగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘రుకు రుకు రుక్మిణి’ తొలి లిరికల్ వీడియో సాంగ్‌ చాలా క్యాచీగా ఉండటంతో వైరల్ అయ్యింది.

ఇప్పుడు రెండో పాట విడుదకు ముహూర్తం ఖరారు చేశారు. పిచ్చి ప్రేమలో అంటూ సాగే రెండో పాట శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ హీరో హీరోయిన్లు ఛాయ్ తాగుతున్న పోస్టర్‌ ఒకటి విడుదల చేశారు.   

మురళీకాంత్‌ దేవసోత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి కుమార్‌, హర్ష్ రోషన్‌ వర్ధన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాలో రచయిత కృష్ణగా నటిస్తున్న నితిన్‌ టీచర్‌గా నటిస్తున్న రుక్మిణి (ఆఫియా సయ్యద్ )తో ప్రేమలో పడతాడు. ఆమె పేరుతో ప్రేమ నవలలు రాస్తుంటాడు. 

ఈ సినిమాకు సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కెమెరా: జోమోన్‌ టీ.జాన్‌, ఎడిటింగ్‌: సృజన అడుసుమిల్లి చేస్తున్నారు. 

నటుడు నాని సమర్పణలో దీప్తి గంటా యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న అలియాస్ రుక్మిణి డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష