కరీంనగర్‌ సభకు బిజేపి జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్

November 10, 2026


img

తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ప్రధాని మోడీ ఎప్పుడో చెప్పారు. ఆ లక్ష్యం వైపు బిజేపి అడుగులు వేస్తున్నట్లుంది.  ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. 

ఇప్పుడు బిజేపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ నెల 18న కరీంనగర్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. 

నితిన్ నబీన్ పర్యటనలో కరీంనగర్‌లో గాంధీ సర్కిల్, వైశ్య భవన్ నుంచి టవర్ సర్కిల్ మీదుగా కమాన్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు బండి సంజయ్‌, బిజేపి నేతలు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం లక్ష మందిని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విషయంలో కాంగ్రెస్, ఇండియా కూటమి ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి సమాధానం చెప్పేందుకే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.


Related Post