ప్రియదర్శి హీరోగా చేస్తున్న సినిమా టైటిల్ ‘ఇడుపు కాయితం’ అని ప్రకటించినప్పుడు, ఏపీ-తెలంగాణ నెటిజన్స్ మధ్య చిన్న యుద్ధాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా జోక్యం చేసుకుంటూ, ‘ఇడుపు కాయితం అర్థం తెలీకపోతే పవన్ కళ్యాణ్‌ని అడగండి. అయన చెపుతారు,” అంటూ వ్యంగ్యంగా అన్నారు. అందుకు అయన అభిమానులు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కానీ నాడు ఆమె పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు తీసుకోబోతున్నారని ముందే తెలిసి ఈ మాటన్నారో లేక ఇదివరకు అయన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారనే ఉద్దేశ్యంతో అన్నారో తెలీదు కానీ నేడు ఆమె చెప్పినట్లే పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాలెజినోవాకు నిజంగానే ‘ఇడుపు కాయితం’ ఇచ్చేస్తున్నారు.
అలాగే జాతాకల పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇదివరకు పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలు నిజమయ్యాయి. పవన్ కళ్యాణ్ జాతకంలో గురుడు నీచస్థానంలో ఉన్నారు కనుక ఆయనకు 3-4 పెళ్ళిళ్ళు జరుగుతాయంటూ ఇదివరకు అయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కానీ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగిన తర్వాత జీవితంలో మళ్ళీ ఇలాంటి ఎదురుదెబ్బ తగలడం ఆయనను, అన్నాను, వారి పిల్లలను, అభిమానులకు అందరినీ తప్పక బాధిస్తుంది.