పవన్ విడాకులపై రేణూ దేశాయ్ స్పందన

November 10, 2026
img

ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, అన్నా లెజినోవ దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు చేసిన ప్రకటన బాంబులా పేలింది. అయితే వారి వ్యవహారంపై ఎవరూ తప్పుగా కామెంట్స్ చేయడం వంటివి చేయరాదని టీడీపి, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ కూడా సోషల్ మీడియాలో ఆదేశాలు జారీ చేసినందున దీనిపై చర్చ తగ్గింది. అయినప్పటికీ చాలా మంది తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్‌ రెండో (మాజీ)భార్య రేణూ దేశాయ్ కూడా ఒకరు. 

అయితే ఆమె పవన్ కళ్యాణ్‌కు అనుకూలంగా ట్వీట్‌ చేయడం విశేషం. “ఒక వ్యక్తి కష్టంలో ఉంటే వాళ్ళని ఇంకా దూషించడం సరికాదు. కింద పడిపోయిన వాళ్ళను తొక్కాలనుకోవడం మానవత్వం అనిపించుకోదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, వాళ్ళు కూడా ఒక మనిషే.. ఒకరి సంతానమే.. ఒకరి తల్లితండ్రులే, లేదా వారికీ పిల్లలు ఉంటారని మరిచిపోకూడదు. మనం అద్దాలమేడలో కూర్చొని దారినపోయే ఇతరులపై రాళ్ళు రువ్వడం మంచిది కాదు. మనమందరం మనుషులమే. అలా అనిపించుకోవడానికి ప్రేమ, సానుభూతి కలిగి ఉండాలి. (నేను ఈవిధంగా వ్రాసినందుకు మళ్ళీ ఏదో ఊహించేసుకోవద్దు. ఎందుకంటే, సమాజంలో భాగంగా మనం ఇంతకంటే బాగా వ్యవహరించగలమని చెప్పడానికే). అలాగే నేను మానవత్వం చూపేందుకు ఎటువంటి పేటీఎం పేమెంట్ పొందలేదు. నా మెదడు సరిగ్గా పనిచేస్తోంది కాబట్టి, ఇలాంటి విషయాలను నేను ఇలాగే అర్థం చేసుకుంటున్నాను,” అని ట్వీట్‌ చేశారు. 

Related Post