పవన్ కళ్యాణ్‌, అన్నా పరస్పర అంగీకారంతో విడాకులు

November 10, 2026
img

ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, ఆయన సతీమణి అన్నా లెజినోవా పరస్పర అంగీకారంతో విడిపోబోతున్నారు. ఈ మేరకు ఇద్దరూ కలిసి ఓ ప్రకటన చేశారు. భార్యాభర్తలుగా విడిపోతున్నప్పటికీ, మంచి స్నేహితులుగా, మంచి తల్లితండ్రులుగా ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటామని ఆ ప్రకటనలో తెలిపారు. కనుక తమ ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని, తమ ప్రైవసీని గౌరవించాల్సిందిగా వారు అందరికీ విజ్ఞప్తి చేశారు. 

పవన్ కళ్యాణ్‌, అన్నాలకు పోలేన అంజన పవోన అనే ఓ కుమార్తె, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఓ కుమారుడు ఉన్నారు. 

పవన్ కళ్యాణ్‌ ఇంతకు ముందు నందిని, తర్వాత రేణూ దేశాయ్‌లను వివాహం చేసుకొని విడాకులు ఇచ్చారు. పవన్-రేణూ దేశాయ్‌లకు అకిరా నందన్ అనే ఓ కుమారుడు, ఆద్య అనే ఓ కుమార్తె ఉన్నారు. వారిని కూడా పవన్ కళ్యాణ్‌, అన్నా దంపతులు చాలా ప్రేమగా చూసుకునేవారు. 

Related Post