వికారాబాద్ జిల్లా హకీంపేటలో సోమవారం రైతన్నతో ఆత్మీయసభలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్లు మిగులు బడ్జెట్‌తో కేసీఆర్ చేతికి వచ్చింది. పన్నుల రూపంలో పదేళ్ళలో మరో 20 లక్షల కోట్లు ఆదాయం వచ్చింది కూడా. అందుకే తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ స్వయంగా చెప్పారు. కానీ పదేళ్ళ పాలనలో రాష్ట్రానికి 8.11 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి పోయారు. ఆయన చేసిన ఆ అప్పులు, వడ్డీలకే మా ప్రభుత్వం ఏటా 80 వేల కోట్లు చొప్పున, ఈ మూడున్నరేళ్ళలో మా ప్రభుత్వం సుమారు రూ. 2 లక్షల కోట్లు చెల్లించింది.
ఆయన అధికారంలో ఉండగా ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆయన దిగిపోయి ఫామ్‌హౌసులో హాయిగా పడుకున్నారు. ఆయన చేసిపోయిన ఆ అప్పులు ప్రభుత్వం చెల్లిస్తూనే ఉండాలి. ఇన్ని లక్షల కోట్లు మిగిలి ఉండి ఉంటే రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు అమలుచేయగలిగి ఉండేవాళ్ళం కదా? ఈ అప్పులు, వడ్డీల భారం మోస్తూనే ఉద్యోగులందరికీ నెలనెలా 1వ తేదీన టంచన్‌గా జీతాలు చెల్లిస్తున్నాము. మరో పక్క ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
జనవరిలో సంక్రాంతి పండగ తర్వాత తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, సునామీ సృష్టిస్తానని దానిలో కేసీఆర్, మోడీ అయినా కొట్టుకుపోతారని అన్నారు. 2028 నాటికి కొడంగల్‌కు కృష్ణా నీళ్ళు తీసుకువచ్చి, రాజకీయంగా నేను ఇంత ఉన్నతస్థాయికి ఎదిగేందుకు తోడ్పడిన ప్రజల రుణం తీర్చుకుంటానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.