యువ నటుడు మౌళి తనూజ్ ప్రశాంత్ చేసిన తాజా చిత్రం ‘డీఎన్‌కే’ ట్రైలర్ విడుదలైంది. అది చూస్తే చాలా రొటీన్ కథతో సినిమా తీసినట్లు అనిపిస్తోంది. ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు. ఈజీ మనీ కోసం చేసే ప్రయత్నంలో ఓ విలన్ చేతిలో చిక్కుకోవడం, ఆ తర్వాత నోట్ల కట్టలు నిండిన బ్యాగ్ కోసం అందరూ చేజింగ్.. ట్రైలర్‌లో ఇదే చూపారు. ఇప్పటికే ఇలాంటి సినిమాలు చాలానే వచ్చి బోర్లాపడ్డాయి. మరి ‘డీఎన్‌కే’ ఎలా ఉంటుందో ఈ నెల 13న విడుదలైతే తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా సుష్మిత శెట్టి నటించగా, సీనియర్ నటుడు అలీ తండ్రి పాత్రలో కనిపిస్తారు. రఘుబాబు, రాజిత, ప్రియా, బబ్లూ, నంద గోపాల్, భద్రం, గుండు సుదర్శన్, రమణ భార్గవ అలీ, రఘుబాబు, రాజిత, ప్రియా, బబ్లూ, నంద గోపాల్, భద్రం, గుండు సుదర్శన్, రమణ భార్గవ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: శ్రీను కంబాల, సంగీతం: సింజిత్ యర్రమిల్లి, కెమెరా: సూర్య బాలాజీ, ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, అనిల్ యెర్నేని కలిసి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 13న విడుదల కాబోతోంది.