సినిమా రిలీజ్‌ ముందు సినిమాటోగ్రాఫర్ మృతి

November 10, 2026


img

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ (57) కన్నుమూశారు. మలయాళ నటుడు దిలీప్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు,  ఆ సినిమాకు పని చేస్తున్న షాజీ కుమార్‌కు అకస్మాత్తుగా అనారోగ్యం తలెత్తింది. దీంతో యూనిట్ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. 

అనంతరం మెరుగైన వైద్యం కోసం కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడంతో షాజీ కుమారు ఆరోగ్యం కొంత మెరుగుపడింది. అయితే ఈరోజు ఉదయం ఆస్పత్రిలో వాష్‌రూమ్‌కు వెళ్తున్నప్పుడు కుప్పకూలిపోయారు. వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. షాజీ కుమార్‌ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

షాజీ కుమార్ దాదాపు పాతికేళ్లకు పైగా 50కి పైగా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాలకు అయన కెమెరాతో మ్యాజిక్ చేసేవారని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ప్రస్తుతం మోహన్‌లాల్ నటించిన 'అతిమనోహరం', సురేష్ గోపీ 'ఒట్టకొంబన్' చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. వీటిలో 'అతిమనోహరం' వచ్చే నెల 24న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే షాజీ కుమార్ మరణించడంతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.


Related Post

సినిమా స‌మీక్ష