ఇడుపు కాయితం నుంచి ఈసారి బారాత్ సాంగ్‌!

November 07, 2026


img

వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో పాట విడుదల చేయబోతున్నారు. 

రేపు దీపావళి పండుగ సందర్భంగా హుషారైన పెళ్ళి బారత్ పాట విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ పోస్టర్‌ వేశారు. దానిలో ప్రియదర్శి, ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతున్న నాగదుర్గ హుషారుగా డాన్స్ చేస్తున్న ఫోటో ఆకట్టుకుంది. 

ఈ సినిమాలో మైమ్ మధు, అభయ్ బేతిగంటి, రచ్చ రవి, జోర్దార్ సుజాత, బిత్తిరి సత్తి, చంద్రవ్వ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి) తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫి: ఎం.ఎస్. బాల్ రెడ్డి ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి, ఆర్ట్ డైరెక్టర్‌: ఆశిష్ తేజ పులాల చేస్తున్నారు. తెలంగాణ గ్రామీణ కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు

సుకుమార్ రైటింగ్స్, బీవీ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వంశీ రెడ్డి దొండపాటి, సురేష్ బొబ్బిలి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 11న థియేటర్లలో విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష