వేదవ్యాస్ దర్శకత్వంలో సుధీర్ ఆనంద్, దివ్య భారతి జంటగా నటిస్తున్న చిత్రం ‘జి.ఓ.ఏ.టి. ఈ సినిమా ట్రైలర్ చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్విరాజ్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, మొట్టా రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, ఆడుకలమ్ నరేన్, ఆనంద్ రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: లియాన్ జేమ్స్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, సన్నీ కొరపాటి, కొరియోగ్రఫీ: ఈశ్వర్ మాస్టర్, స్టంట్స్: రబిన్ సుబ్బు, స్టంట్ జశువా, పృథ్వీ మాస్టర్, వీఎఫ్ఎక్స్: ప్రదీప్ పూడి, శ్రీశైలం, ఎడిటింగ్: విజయ్ ఎం చేస్తున్నారు.
జైష్ణవ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మొగ్గుల చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి.ఎన్ సహ నిర్మాతగా, ప్రసూన మందవ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ నెల 12న ఈ సినిమా విడుదల కాబోతోంది.