బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైసన్ నాయుడు’. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ పాట ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. సురేష్ గంగుల వ్రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచి సంగీతం అందించగా, రోహిణి సొరట్ తనదైన శైలిలో అద్భుతంగా పాడారు. పూర్తి పాట శనివారం విడుదల కాబోతోంది.
ఈ సినిమాలో నరేష్, రావు రమేష్, సత్య, వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రవీణ, శత్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: అనిత్ మధాడి, కొరియోగ్రాఫీ: విజయ్ పోలాకి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు చేస్తున్నారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.