సంక్రాంతి తర్వాతే ఆర్‌సీ-17 షూటింగ్‌?

November 06, 2026


img

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘రంగస్థలం’ ఓ బ్లాక్‌బస్టర్. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మొదలుపెట్టిన ‘ఆర్‌సీ-17’ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. కనుక త్వరలోనే షూటింగ్ మొదలవుతుందనుకుంటే కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. 

తాజా సమాచారం ప్రకారం ‘ఆర్‌సీ-17’ జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత ఎప్పుడైనా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆలోగా ఈ సినిమాకు ముఖ్య నటీనటుల ఎంపిక, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడీగా తెలుగమ్మాయి సాత్విక వీరవల్లిని ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను తీసుకున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తోంది.


Related Post

సినిమా స‌మీక్ష