ఈ నగరానికి ఏమైంది-2 ట్రైలర్‌

November 04, 2026


img

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌గా వస్తున్న ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ సినిమా మూడో భాగం ఉండదని ఇదే చివరిదాని దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ స్పష్టం చేశారు. 

2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ఇన్నేళ్ళ తర్వాత దానికి సీక్వెల్‌గా దీనిని తీసుకువస్తున్నారు. దీని ట్రైలర్‌ చాలా బాగుంది కనుక ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. 

ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. 

రూట్‌నోడ్ సినిమా బ్యానర్‌పై శృజన్ యెరబోలు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.


Related Post

సినిమా స‌మీక్ష