సినిమాలో కూడా విజయ్ దేవరకొండ, రష్మిక భార్యాభర్తలుగా నటించిన చిత్రం ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మిశ్రమ స్పందన రావడంతో అభిమానులను నిరాశ పరిచిచింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 13 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది. ఒకేసారి 5 భాషల్లో ప్రసారం కాబోతోంది.
ఈ సినిమాలో బ్రిటిష్ వారి ఆకృత్యాలను ఎదిరించే రాయలసీమ యోధుడు రణబాలిగా విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా నటించారు.
ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేశారు.
గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి రణబాలి నిర్మించారు.