మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘ఆర్‌సీ17’ కొత్త సినిమా పూజా కార్యక్రమంతో నేడు లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్, రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
పూజానంతరం చిరంజీవి రామ్ చరణ్‌పై క్లాప్ కొట్టి లాంచనంగా షూటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత రామ్ చరణ్ తండ్రి పాదాలకు నమస్కారం చేయగా, అయన ప్రేమగా అతనిని కౌగలించుకొని ఆశీర్వదించారు.
ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. యి.
ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక పూజా కార్యక్రమంలో ఆమె లేదా వేరేవరినైనా హీరోయిన్‌గా ఎంపిక చేసుకొని ఉండి ఉంటే ఆమెను తప్పక పరిచయం చేస్తారని అభిమానులు ఎదురుచూశారు. కానీ ఈ కార్యక్రమంలో హీరోయిన్ కనపడలేదు.
ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. త్వరలో హీరోయిన్‌తో సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నేడు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి కనుక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారు.