ఏపీలో దారుణం... తరగతి గదిలోనే బాలికపై దాడి

October 31, 2026
img

ఆంధ్రప్రదేశ్‌లో చాలా దారుణ ఘటన జరిగింది. అనంతపురం జిల్లా రాప్తాడులోని స్థానిక జెడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఓ ఉన్మాది చెట్లు కోసే రంపం మెషిన్‌తో దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె చెయ్యి తెగిపోయింది. ఆ బాలిక గొంతు, వీపుపై రంపంతో తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకోబోయిన మరో బాలికకు కూడా గాయాలయ్యాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆ ఇద్దరు బాలికలను ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయురాలు, విద్యార్ధినులు చెప్పిన వివరాలు, సీసీ కెమెరా రికార్డింగ్ ఆధారంగా పోలీసులు గాలింపు మొదలుపెట్టి   ధర్మవరం రైల్వే స్టేషన్‌ వద్ద పట్టుకున్నారు. నాగులూరుకు చెందిన హేమంత్‌గా పోలీసులు గుర్తించారు. అతనిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ప్రశ్నిస్తున్నారు. 

ఈ ఘటనపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే స్పందింఛి పోలీసులకు తగు ఆదేశాలు జారీ చేశారు. సిఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి బాలిక తల్లితో మాట్లాడి ధైర్యం చెప్పారు.

Related Post