ఇస్రో ఎన్‌వీఎస్-03 ప్రయోగం విజయవంతం

October 31, 2026
img

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన మరో ప్రయోగం విజయవంతం అయ్యింది. ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం రాత్రి 11.51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా నావిక్-03 (ఎన్‌వీఎస్-03) ఉపగ్రహాన్ని అంతరిక్షంలో నిర్దిష్ట కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.  

జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 20వ ప్రయోగం. ఎన్‌వీఎస్-03 ఉపగ్రహం మరింత మెరుగైన జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్) సేవలు అందిస్తుంది. భారత్‌తో పాటు దేశ సరిహద్దుల నుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధిలో నావిగేషన్ సేవలు అందించేలా దీనిని రూపొందించారు.

ఉపగ్రహ నావిగేషన్‌లో ఖచ్చితమైన సమయాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. కనుక దీనిలో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘అటామిక్ క్లాక్‌’ అమర్చారు. ఈ ఉపగ్రహం ఇప్పటికే ఉన్న ఎల్-5, ఎస్ బ్యాండ్లతో పాటు ఎల్-1 సిగ్నల్‌ను కూడా అందిస్తుంది. 

ఈ ఉపగ్రహం సేవలు ఇప్పటికే కొన్ని అందుబాటులోకి వచ్చాయి. ఇది భారత్‌కు 13 ఏళ్లపాటు సేవలు అందిస్తుంది. 

Related Post