ఇంద్రవెల్లిలో నేడు కవిత పాంచజన్య సంకల్ప సభ

October 30, 2026


img

కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరింపబడటమే తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం. ఆ తర్వాత ఆమె టీఆర్ఎస్‌ పార్టీ స్థాపించడం, తండ్రి కేసీఆర్‌, అన్న కేటీఆర్‌, బావ హరీష్‌ రావులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ నేటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నారు. 

టీఆర్ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసుకునే ముందు ఆ తర్వాత ఆమె చాలా చురుకుగా రాజకీయాలలో పాల్గొంటున్నారు. తరచూ సభలు, సమావేశాలు, ధర్నాలు చేస్తూ తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రాజకీయ కార్యక్రమాలలో తిరుగుతుంటారు కనుక తన ప్రయాణాలకు, ప్రచారానికి అనుకూలమైన ఓ ప్రచార రధం (ఏసీ బస్సు) కూడా ఏర్పాటు చేసుకున్నారు. నేడు డజన్ల కొద్దీ కార్లలో టీఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు వెంటరాగా ఆ బస్సులోనే ఇంద్రవెల్లి చేరుకున్నారు. 

ముందుగా అక్కడ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి ఆ తర్వాత అక్కడకి సమీపంలోనే ఉన్న వేదిక వద్దకు చేరుకున్నారు. 

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు, కాంగ్రెస్‌ ప్రభుత్వం గోదావరి జలాలను ఎత్తిపోయకుండా దిగువకు విడిచి పెట్టేస్తుండటం, అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పార్టీల విమర్శలతో ఆమె ప్రసంగం సాగుతుంది.    


Related Post