ఎల్‌నినో ప్రభావంతో నీళ్ళ కొరతతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నవంబర్ 1వ నుంచి 4వ తేదీ వరకు రాజధాని హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలియజేసింది.
శనివారం సాయంత్రం నుంచే హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలలో వర్షాలు మొదలవుతాయని తెలియజేసింది. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాలకు అవి విస్తరిస్తాయని తెలిపింది. నవంబర్ 2,3 తేదీలలో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.
అంటే తెలంగాణకు నవంబర్ నెల చక్కటి వర్షాలతో మొదలైందన్న మాట! ఇది చాలా సంతోషకరమైన విషయమే కదా.