చిరంజీవి హోస్ట్‌గా ‘మెగావర్స్’ టాక్ షో

October 30, 2026


img

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా  నెట్‌ఫ్లిక్స్‌కోసం ‘మెగావర్స్’ అనే పేరుతో ఓ టాక్ షో సిద్దమవుతోంది. ఇటీవలే దీని షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో చిరంజీవితో అనుబంధం ఉన్న పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొని ఆయన ద్వారా ప్రేక్షకులతో తమ అనుభవాలు పంచుకోనున్నారు. 

అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, తెరవెనుక జరిగిన ఆసక్తికర సంఘటనలు, ఇతర నటీనటులతో ఉన్న అనుబంధాలను, తాను చేయబోతున్న కొత్త సినిమా విశేషాలు ప్రేక్షకులతో పంచుకొబోతున్నారు. 

చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. కానీ దాంతో బాటు ఈ ‘మెగావర్స్’ టాక్ షో షూటింగ్‌ కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

తొలి ఎపిసోడ్లో ఎవరు పాల్గొంటారు? ‘మెగావర్స్’లో మొత్తం ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి? ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? వంటి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష