రాఘవ లారెన్స్ ‘మహావీర్ కర్ణ’ పోస్టర్ చూశారా?

September 29, 2026


img

కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ తొలిసారిగా 'మహావీర్ కర్ణ' పౌరాణిక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 

రాఘవ లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ విడుదల చేసింది. దానిలో ఆయన కర్ణుడి వేషధారణలో గుర్రంపై స్వారీ చేస్తూ, చేతిలో విల్లు, బాణంతో అద్భుతంగా ఉన్నారు.

రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో చైతన్య రావు, మురళీ కృష్ణ, పెనుమేస్త ధనుంజయ్ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

శ్రీ నిలాద్రి, ఆర్‌వీ స్టూడియోస్, పెన్ మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం 2027లో ఐదు భాషల్లో విడుదల కానుంది.


Related Post

సినిమా స‌మీక్ష