నాకు అంత ఓపిక, సమయం రెండూ లేవు: ఏఆర్ రెహమాన్

October 27, 2026


img

నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న రామాయణ (మొదటి భాగం) నుంచి ఇటీవల ‘రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ పేరుతో ‘మంగళ్ రంగ్’అనే పాట విడుదలైంది. ఈ పాటకు ఖవ్వాలీ తరహా సంగీతం అందించారంటూ నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

అంతకుముందు విడుదలైన ‘రైజ్ ఆఫ్ అసుర’ పేరుతో వచ్చిన ‘శివ తాండవం’ పాటపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. వీటిపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు.

ఒక్కో పాటని సిద్ధం చేయడానికి ఎంతో సమయం కేటాయించి, పరిశోధనలు, అనేక ప్రయోగాలు చేసిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము తప్ప ఏదో ఆషామాషీగా కాదు. 

కనుక నాకు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను గమనిస్తూ కూర్చునే సమయం, వాటికి జవాబు చెప్పే ఓపిక లేవు. నిన్న నాపై విమర్శలు చేసినవారే మర్నాడు క్షమాపణలు చెబుతున్నారని నా కుమారుడు చెబుతుంటాడు. నా పని నేను చాలా అంకితభావంతో చేస్తాను. నా సంగీతం ప్రేక్షకులకు నచ్చి వారు ఆస్వాదిస్తే చాలు.

గతంలో ‘రోజా’, ‘బాంబే’ వంటి సంగీతాన్ని మళ్లీ అందించాలని కొందరు కోరుతుంటారు. కానీ మనం ఎప్పుడూ పాత విజయాల దగ్గరే ఆగిపోకూడదు. నిరంతరం కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగాలి. 

నా ఈ సంగీత ప్రయాణంలో మూడు దశాబ్దాల తర్వాత ‘రామాయణం’ వంటి గొప్ప ఇతిహాసానికి సంగీతం అందించడం ప్రత్యేకమైన బాధ్యత, గౌరవంగా భావిస్తున్నాను,” అని ఏఆర్ రెహమాన్ అన్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష