సింగరేణి: ఓ పక్క బోనస్.. మరోపక్క ఆందోళనలు!

October 14, 2026


img

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న దసరా బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా లాభాలలో 34 శాతం వాటాను కార్మికులకు బోనస్‌గా అందిస్తామని డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నిన్నే ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో కార్మికుడుకి ఒకటిన్నర లక్షలు చేతికి అందుతుంది. 

ఈ ఏడాది ప్రభుత్వం ఎంతో కొంత బోనస్ పెంచి ఇస్తుందని కార్మికులు ఆశిస్తే పెంచకుండా గత ఏడాది ఇచ్చినట్లే 34 శాతం ఇస్తున్నట్లు ప్రకటించడంపై కార్మికులలో కొంత అసంతృప్తి నెలకొంది. 

కానీ ఈ బోనస్‌ చేతిలో పడగానే వారు తమ సమస్యలు, అవసరాలు తీర్చుకోగలుగుతారు. కనుక అందరూ బోనస్ సొమ్ము కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

మరోపక్క  ఏఐటియూసీ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ల అధ్వర్యంలో హైదరాబాద్‌లో విద్యుత్ సౌధ ఎదుట ధర్నాలు జరుగుతున్నాయి. 

విద్యుత్ సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన రూ.59 కోట్లు బకాయిలు ప్రభుత్వం తక్షణం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే బొగ్గు గనుల వద్ద ధర్నాలు చేపట్టి జెన్ కో, ట్రాన్స్‌కోలకు బొగ్గు సరఫరా కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. 

గత ప్రభుత్వ హయంలో సింగరేణికి రూ.26 కోట్లు ఉండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ అప్పులు తీర్చకపోగా మరో రూ.31 కోట్లు అప్పు బకాయి పెట్టిందని యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. 

సింగరేణి కార్మికులు తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి సంస్థకు లాభాలు ఆర్జించి పెడుతుంటే ప్రభుత్వాలు వారి కష్టాన్ని ఈవిధంగా దోచుకున్తున్నాయని ఆరోపించారు. 

హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ ధర్నాలో పాల్గొనేందుకు సింగరేణి కార్మికులు భారీగా తరలివచ్చారు. 


Related Post