ఆ బొద్దింకల వెనుక కాంగ్రెస్‌ హస్తం ఉందట!

October 08, 2026


img

తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ నుంచి బయటపడి కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్‌ పార్టీ పెట్టుకున్నారో, ఇంచుమించు అటువంటి అవమానకర పరిస్థితిలోనే ఏపీలో వైసీపీని విడిచిపెట్టారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. త్వరలో అయన కూడా కొత్త పార్టీ ప్రకటించబోతున్నారు. 

కనుక ముందుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు. నేడు తిరుపతి సమావేశంలో అయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

“కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వెనుక కాంగ్రెస్‌ పార్టీఏ ఉంది. మోడీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచి, అధికారంలోకి రావాలనే దురాలోచనతో అదే వారిని నడిపిస్తోంది. నాడు ఇందిరా గాంధీజీ మొదలు నేడు సోనియా, రాహుల్, ప్రియాంక వరకు అందరూ గాంధీలమని చెప్పుకుంటారు. కానీ వారి అసలు పేరు గాంధీ కాదు... గండి. మహాత్మాగాంధీ కుటుంబంతో వీరి కుటుంబానికి ఎటువంటి రక్తసంబంధం లేకపోయినా ‘గండి’ని ‘గాంధీ’గా మార్చేసుకొని గాంధీజీ వారసులుగా చలామణి అవుతున్నారు.

నాడు భారత్‌ నుంచి పాకిస్తాన్‌ విభజన జరిగింది కాంగ్రెస్‌ పార్టీ వల్లనే. భారత్‌ నుంచి కాశ్మీర్‌ విడిపోయేందుకు కారణం కాంగ్రెస్‌ పార్టీయే. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ నమ్మదగినది కాదు,”అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 


Related Post