టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విషయంలో పొరపాటున ‘ఎయిడ్స్’ అనే పదం వాడినందుకు తెలంగాణ మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేస్తూ మీడియా ద్వారా ఆమెకు క్షమాపణలు తెలిపారు.
ఆమె ఏమన్నారంటే, తాను అదివారం ములుగులో చేయూత పెన్షన్ల పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన చెల్లెలు కల్వకుంట్ల కవితకు ఎయిడ్స్ వ్యాధి సోకిందని, త్వరలో ఆమె చనిపోబోతోందని తన సోషల్ మీడియా టీమ్‌తో దుష్ప్రచారం చేయించారు. ఈ విషయం కల్వకుంట్ల కవిత స్వయంగా బయటపెట్టి ఆవేదన వ్యక్తం చేశారు కూడా,” అని అన్నారు.
అయితే కల్వకుంట్ల కవిత క్యాన్సర్ వ్యాధి అని చెప్పగామంత్రి సీతక్క పొరపాటున ఎయిడ్స్ వ్యాధితో అని చెప్పారు. ఇది వారాల్ అవడంతో ఆమె దృష్టికి రాగానే కల్వకుంట్ల కవితకు క్షమాపణలు చెప్పారు.
కవిత స్వయంగా ఓ మీడియా ఛానెల్‌కు చెప్పిన విషయాన్నే తాను ప్రస్తావించానని వివరించారు. కవిత గతంలో చెప్పిన మాటలను ఉటంకించే క్రమంలో పొరపాటున ఆ పదం దొర్లిందని సీతక్క స్పష్టం చేశారు. అయితే వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సరిదిద్దుకున్నానని తెలిపారు.
కానీ వరంగల్ పర్యటనలో పెన్షన్లపై కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారాన్ని తాను తిప్పికొట్టాననే అక్కసుతోనే తన మాటలను బీఆర్ఎస్ పార్టీ ఇంకా సోషల్ మీడియాలో వైరల్ చేస్తోందని ఆమె మండిపడ్డారు.
సొంత చెల్లి క్యాన్సర్ పేషంట్ అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించిన కేటీఆర్, తనను ఉపేక్షిస్తారనుకోవడం లేదని సీతక్క అన్నారు.
తాను ఎల్లప్పుడూ రాజకీయ ప్రత్యర్థులను సిద్ధాంతపరంగానే ఎదుర్కొంటానని, వ్యక్తిగత విమర్శలు చేయడం తన నైజం కాదని, ఈ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసని మంత్రి సీతక్క అన్నారు.
కవితపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో పొరపాటు జరిగిందంటూ మంత్రి సీతక్క విచారం..
నిన్న ములుగులో చేయూత పెన్షన్ల పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడే క్రమంలో..
కవిత మాటలను ఉటంకిస్తుండగా పొరపాటున ఆ పదం దొర్లిందని వివరణ..
ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని సరిదిద్దుకున్నప్పటికీ..
బీఆర్ఎస్ శ్రేణులు కావాలనే వీడియోను వైరల్ చేస్తూ ట్రోల్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం..
రాజకీయ కక్షతో బీఆర్ఎస్ తనను క్యాన్సర్ పేషెంట్‌గా చిత్రీకరించిందని..
కవిత స్వయంగా ఓ మీడియా ఛానెల్‌కు చెప్పిన విషయాన్నే తాను ప్రస్తావించానని స్పష్టం..
వరంగల్ పర్యటనలో పెన్షన్లపై కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారాన్ని తాను తిప్పికొట్టాననే అక్కసుతోనే..
తన మాటలను వక్రీకరిస్తున్నారని సీతక్క మండిపాటు..
తాను రాజకీయ ప్రత్యర్థులను సిద్ధాంతపరంగానే ఎదుర్కొంటానని..
వ్యక్తిగత విమర్శలు చేయడం తన నైజం కాదని రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసని సీతక్క వ్యాఖ్య..
#Seethakka #KalvakuntlaKavitha #KTR #BRS #TelanganaPolitics #Mulugu #RTV
My statement got misinterpreted. While quoting what @TRSparty_HQ President Smt. @RaoKavitha said to a media interview, a word slipped unintentionally. It was not said deliberately, and I withdrew it immediately. I did not intend it against Kavitha garu. It is unfortunate that some in BRS are viralising it out of political anger, after I countered KTR garu's false propaganda on Cheyutha pensions in Warangal. I fight political opponents politically. Personal remarks are not my nature.
— Danasari Seethakka (@seethakkaMLA) November 24, 2026