విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న ‘నాన్నకుట్టి’ ట్రైలర్ విడుదలైంది. దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదల కావాల్సిన ఈ సినిమా నవంబర్ 27న విడుదల కాబోతోంది.
‘నాన్న కుట్టీ’ పేరులోనే ఇది తండ్రీకూతుర్ల సెంటిమెంట్ సినిమా అని చెప్పేశారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీకి జంటగా ప్రీతి నటిస్తున్నారు. హరిప్రియా, యాక్టర్ బక్స్, అరువి మదన్, ముత్తుకుమార్, దివాకర్ జి.జె., లిజ్జీ ఆంటోనీ, మున్నార్ రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: ముమరన్, సంగీతం, ఎడిటింగ్: విజయ్ ఆంటోనీ, ఆర్ట్: ఏ రాజా చేశారు.
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ తమిళంలో ఈ సినిమా నిర్మించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజి సహ నిర్మాతగా తెలుగు వెర్షన్ అందిస్తున్నారు. నాన్న కుట్టీ తెలుగు, తమిళ్ భాషల్లో నవంబర్27న విడుదల కాబోతోంది.